- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త స్నేహితుడు అని నమ్మితే.. రూ.50 లక్షలు ముంచాడు
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తక్కువ సమయంలో భారీ లాభాలను ఇప్పిస్తానని నమ్మించి రూ. 50 లక్షలు మోసం చేశాడని ఓ మహిళ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, సిటీక్రైం : స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తక్కువ సమయంలో భారీ లాభాలను ఇప్పిస్తానని నమ్మించి రూ. 50 లక్షలు మోసం చేశాడని ఓ మహిళ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వి.దీపశ్రీకి తన భర్త స్నేహితుడైన అమిత్ బన్సల్ పరిచయం అయ్యాడు. తాను స్టాక్ట్ ట్రేడింగ్ ఇన్విస్టెమెంట్స్ నిపుణుడని, ఏజెంట్ గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తనకు ఉన్న అనుభవంతో స్టాక్ ట్రేడింగ్ మార్కెట్ లో ఇన్విస్టెమెంట్ పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు ఇస్తానని చెప్పాడు. దీపశ్రీ భర్తను కూడా ఆరా తీయడంతో అమిత్ స్టాక్ ట్రేడింగ్ నిపుణుడిగా పేరొందాడని తెలిపాడు.
దీపశ్రీ అమిత్ బన్సల్ అనుచరులు బి.కిరణ్ గౌడ్, కె.సంజయ్ లకు 2023 మార్చి నెలలో స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడిగా రూ. 50 లక్షలు నాలుగు బ్లాంక్ చెక్కులు, ఆర్ టీజీఎస్ ఫామ్స్ ను ఇచ్చింది. అమిత్ బన్సల్ తన అనుచరులతో కలిసి దీపశ్రీ అనుమతి లేకుండానే ఈ చెక్కులు, ఆర్ టీజీఎస్ ఫామ్స్ ద్వారా డబ్బును డ్రా చేసుకున్నాడని గుర్తించింది. అమిత్ బన్సల్ తనకు ఇచ్చిన గడువు ప్రకారం... పెట్టుబడులకు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో, తన పెట్టుబడి డబ్బులను ఇవ్వమని అడిగితే దూషించడంతో పాటు బెదిరింపులకు దిగాడని నేను డబ్బులు ఇవ్వనని ఎవరీకి చెప్పుకుంటావో చెప్పుకోమని హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో తనను పెట్టుబడికి భారీ లాభాలంటూ మోసం చేసిన అమిత్ బన్సల్, అతని అనుచరులు కిరణ్ గౌడ్, సంజయ్ లపై దీపశ్రీ హైదరాబాద్ సీసీఎస్ లో కొద్ది రోజుల కిందట ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై పోలీసులు 73/2026 క్రైంనెంబరులో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని బీఎన్ఎస్ కింద అభియోగాలను నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.






