- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి
వ్యవసాయ రంగమే తీవ్ర సంక్షోభంలో పని చేస్తుందని.. ఉద్యమం ద్వారానే కౌలుదారుల హక్కులు అందుతాయని అందుకోసం ఓ జాయింట్ యాక్షన్ కమిటీ( జేఏసీ)ఏర్పడితే బాగుంటుందని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు.

దిశ, రాంనగర్ : వ్యవసాయ రంగమే తీవ్ర సంక్షోభంలో పని చేస్తుందని.. ఉద్యమం ద్వారానే కౌలుదారుల హక్కులు అందుతాయని అందుకోసం ఓ జాయింట్ యాక్షన్ కమిటీ( జేఏసీ)ఏర్పడితే బాగుంటుందని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు.హైదరాబాద్, బాగ్ లింగం పల్లి, సుందర విజ్ఞాన కేంద్రంలో గురువారం తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలను వారికి వర్తింప చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని నేపథ్యంలో రైతు స్వరాజ్య వేదిక, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్త జాయింట్ ఘోష కమిషన్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కౌల్ రైతుల గుర్తింపు సాధన కమిటీ పేరుతో ప్రజా సంఘాలు మేధావులు కౌల్ రైతుల గుర్తింపునకు పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని రైతు స్వరాజ్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. 2011 భూ అధికృత సాగు దారుల చట్టం ప్రకారం కళ్ళు రైతుల నుండి దరఖాస్తుల స్వీకరించి గ్రామ సభల ద్వారా నిర్ధారణ చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని పథకాలకు పంట రుణాలకు అర్హత కల్పించే బాధ్యత ప్రభుత్వం పై ఉందని పేర్కొన్నారు.తెలంగాణలో 22 లక్షల పైగా ఉన్న కౌలు రైతులు అన్నదాతలలో 36 శాతం గా ఉన్నారని, బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు అందాక అత్యంత దుస్థితిలో ఉన్న కౌలు రైతు ఆత్మహత్యల్లో 80 శాతం కౌల్ రైతులేనని ,దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఈ సమావేశంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులను గుర్తించి వారికి అన్ని పథకాలు అందించినప్పుడే తెలంగాణ రైతంగం పరిస్థితి మెరుగుపడుతుందని, దీనికోసం ఉమ్మడి పోరాటం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్, కొండవీటి సత్యవతి, దళిత బహుజన ఫ్రంట్ పి శంకర్, తెలంగాణ రైతు సంఘం ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య, తెలంగాణ పీపుల్స్ జేఏసీ రవి చందర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు బి కొండల్, కన్నెగంటి రవి, ఎస్ ఆశాలత, విశ్వ కిరణ్ కుమార్, శ్రీహర్ష, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.






