Ajaruddhin : వారిని కోర్టుకు లాగుతాను : మాజీ స్టార్ క్రికెటర్

by Muthe.Rajitha |

క్రికెట్లో అజారుద్దీన్(Cricketer Ajaruddhin) గురించి, ఆయన బ్యాటింగ్ స్టైల్ గురించి తెలియని వారుండరు.

Ajaruddhin : వారిని కోర్టుకు లాగుతాను : మాజీ స్టార్ క్రికెటర్
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్లో అజారుద్దీన్(Cricketer Ajarudhin) గురించి, ఆయన బ్యాటింగ్ స్టైల్ గురించి తెలియని వారుండరు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ కొంతకాలం హెచ్సీఏ(HCA) కు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఓ స్టాండ్ కు పెట్టిన అజారుద్దీన్ పేరును హెచ్సీఏ అంబుడ్స్ మన్ తొలగించింది. ఈ నిర్ణయంపై అజారుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా జట్టుకు 10 ఏళ్లు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిని ఇంతలా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు.

స్టాండ్ కు తన పేరు పెట్టే సమాయనికే తన పదవీ కాలం ముగిసిందని, అపుడు స్టాండ్ కు ఉన్న తన పేరును తొలగించి అవమానించారని అన్నారు.ఈ వ్యవహారంపై తాను హైకోర్టు(High Court)కు వెళ్తానని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడకుండా నిక్కచ్చిగా ఉన్నందుకే తనను లక్ష్యంగా చేసుకొని, తన పరువు తీస్తున్నారని ఆవేదన చెందారు. ఇకపై చూస్తూ ఊరుకోబోనని, వారిని కోర్టుకు లాగి తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తానని అజార్ పేర్కొన్నారు.

Next Story