- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈగల మోత.. దుర్వాసన
సీతాఫల్‌మండి ప్రాంతాల్లో పలు మటన్, చికెన్ దుకాణాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పూర్తిగా వి స్మరించబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, సీతాఫలమండి : సికింద్రాబాద్ నగరంలోని బౌద్ధనగర్, చిలకలగూడ, సీతాఫల్‌మండి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పలు మటన్, చికెన్ దుకాణాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పూర్తిగా వి స్మరించబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ వేలాది మంది కొనుగోలుదారులు ఈ దుకాణాలను ఆశ్రయిస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల కనీస శుభ్రతా నిబంధనలు కూడా పా టించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన అంశమైనప్పటికీ సం బంధిత శాఖల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగంగానే విక్రయాలు..
అనేక దుకాణాల్లో మాంసాన్ని ఎలాం టి రక్షణ లేకుండా బహిరంగంగా వేలాడదీసి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రహదారులపై ఎగిరే దుమ్ము, ధూళి నేరుగా మాంసంపై పడుతున్నప్పటికీ వ్యాపారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో మాంసం నిల్వ చేసే ఫ్రీజర్లు కూడా సరైన స్థితిలో లేకపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈగలతో నిండిన దుకాణాలు
మాంసం విక్రయించే ప్రాంతాల్లో ఈ గలు అధికంగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మాంసం పై, కటింగ్ టేబుళ్లపై, వ్యర్థాలపై ఈ గలు వాలడం సాధారణంగా మారింద ని పేర్కొంటున్నారు. కాగా, చికెన్, మటన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించాల్సి ఉండగా కొన్ని ప్రాం తాల్లో వాటిని బహిరంగ ప్రదేశాల్లోనే పడేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో దుర్వాసన వ్యాపించడంతో పాటు వీధి కుక్కలు, ఇతర జంతువులు అక్కడికి చేరుకుంటున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న దుకాణాల వద్ద ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని అంటున్నారు. చిలకలగూడ, బౌద్ధనగర్ ప్రాంతాల్లో కొన్ని దుకాణాల వద్ద ఉదయం నుంచి సా యంత్రం వరకు దుర్వాసన వస్తోందని స్థానిక మహిళలు చెబుతున్నారు. ఆ హార భద్రతా నిబంధనలు అమలు కావట్లేదని విమర్శిస్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ చేసిన మాంసం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, డయే రియా, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవ కాశం ఉంటుంది.
ఫిర్యాదులు పట్టించుకునేవారెవరు?
పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని స్థానికులు చెబుతున్నారు. తనిఖీలు నిర్వహించినా అవి తాత్కాలికంగానే పరిమితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. బౌద్ధనగర్, చిలకలగూడ, సీతాఫల్‌మండి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వ హించి అపరిశుభ్రంగా ఉన్న మటన్, చికెన్ దుకాణాలను గుర్తించాలని స్థా నికులు కోరుతున్నారు.






