అక్రమ హోర్డింగుల‌ను తొల‌గించిన హైడ్రా

by Muthe.Rajitha |

న‌గ‌ర శివారు మున్సిపాలిటీల్లో అనుమ‌తి లేని హోర్డింగ్‌లను తొల‌గించాలని హైడ్రా నిర్ణయించింది.

అక్రమ హోర్డింగుల‌ను తొల‌గించిన హైడ్రా
X

దిశ, తెలంగాణ బ్యూరో : న‌గ‌ర శివారు మున్సిపాలిటీల్లో అనుమ‌తి లేని హోర్డింగ్‌లను తొల‌గించాలని హైడ్రా నిర్ణయించింది. మున్సిపాలిటీ అధికారుల స‌మ‌క్షంలోనే తొలగింపు ప్రక్రియను చేపట్టారు. వారం రోజుల్లో 53 హోర్డింగుల తొల‌గించారు. యూనిపోల్స్ 35, యూని స్ట్ర‌క్ష‌ర్స్ 04, ఇంటిపై క‌ప్పుల‌పైన పెట్టిన హోర్డింగ్స్ 14 ఉన్నాయి. శంషాబాద్‌, కొత్వాల్‌గూడ‌, నార్సింగి, తొండుప‌ల్లి, గొల్ల‌ప‌ల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌కు ఇరువైపులా ఉన్న వాటిని తొల‌గించారు.

అనుమ‌తులుంటే తొల‌గించం: హైడ్రా

యాడ్స్ ఏజెన్సీల ప్రతినిధులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ను కలిశారు. నుమ‌తులున్న వాటిని తొల‌గించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. న‌గ‌ర శివారు మున్సిపాలిటీల ప‌రిధిలో అనుమ‌తులు లేని ప్ర‌క‌ట‌నల‌ హోర్డింగ్‌ల‌ను (యూనీ పోల్స్‌, యూనీ స్ట్ర‌క్ష‌ర్లు, హోర్డింగ్‌)ల‌ను తొల‌గిస్తామని చెప్పారు. అనుమ‌తులు లేనివాటిని తొల‌గించేందుకు వారం, 10 రోజులు స‌మ‌యం కావాల‌ని.. ప్ర‌తినిధులు కోర‌గా.. గ‌తంలో ఇచ్చామ‌ని.. మీరు ముందుకు రాక‌పోవ‌డంతోనే హైడ్రా తొలగిస్తోందని ఆయన స్ప‌ష్టం చేశారు.

Next Story