- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hydra : జలమండలి భూమిని కాపాడిన హైడ్రా.. 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్
Hydra : జలమండలి భూమిని కాపాడిన హైడ్రా.. 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్
by Ramesh Naini |
రాంపల్లి విలేజ్ సర్వే నంబరు 388లో జలమండలికి (HMWSSB)కి చెందిన 4.01 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి విలేజ్ సర్వే నంబరు 388లో జలమండలికి (HMWSSB)కి చెందిన 4.01 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. జలమండలి అవసరాల మేరకు ఇక్కడ భూమిని కేటాయించగా.. దానిని స్వాధీనం చేసుకోవడంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ప్రహరీ నిర్మాణాన్నిఅడ్డుకుని ఆటంకాలు సృష్టించగా.. హైడ్రా సహాయాన్ని జలమండలి కోరింది. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి జలమండలికి ప్రభుత్వం కేటాయించినట్టు హైడ్రా నిర్ధారించుకుంది. ఈ మేరకు శనివారం 4.01 ఎకరాల జలమండలికి చెందిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. జలమండలికి చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
Next Story






