- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైడ్రా అంటే..ఇక హడలే..!
దిశ, సిటీబ్యూరో: ట్రైసిటీ పరిధిలోని సర్కారు ఆస్తులను కాపాడడంతో పాటు మరింత పటిష్టంగా విపత్తుల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాటైన హైడ్రా అంటేనే ఇక హడల్ పుట్టించనుంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించనుంది. ఇటీవలే ఏర్పాటైన హైడ్రా కబ్జాలు, ఆక్రణలపై మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టేందుకు వీలుగా మొత్తం 11 క్యాటగిరీలకు చెందిన వివిధ హోదాల్లో మొత్తం 259 మంది పోలీసు ఆఫీసర్లతో క్యాడర్ స్ట్రెంథ్‌ను సర్కారు ప్రకటించింది. వీరంతా హైడ్రాలో డిప్యూటేషన్ ప్రాతిపదికన పని చేయనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో వెల్లడించింది. వీరిలోఓ ఐపీఎస్ ఆఫీసర్ ఉండగా, మరో ముగ్గురు నాన్ క్యాడర్ ఆఫీసర్లుండనున్నారు. అత్యధిక సంఖ్యలో 101 మంది పోలీస్ కానిస్టేబుళ్లను నియమించుకోవాలని సర్కారు ఆదేశాలిచ్చింది.
డీఎస్‌పీ, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, రిజర్వుడ్ సబ్ ఇన్‌స్పెక్టర్, హోం గార్డులతో పాటు అనలిటికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లు వంటి క్యాటగిరిల్లో సిబ్బందిని నియమించుకోనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి నియామకం జరిగిన తర్వాత హైడ్రా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలను మరింత వేగవంతంగా చేయనున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా భూ కబ్జాలు, చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఫిర్యాదులను లోతుగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సందర్శనలు చేసి, బాధ్యులను డెడ్ లైన్ లోపు గుర్తించి, కోర్టుల్లో శిక్షలు పడేలా హైడ్రా వ్యూహం ఉండబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే 11 క్యాటగిరీలకు చెందిన 259 మంది పోలీసు ఆఫీసర్లను నియమించుకున్న తర్వాత ప్రస్తుతమున్న హైడ్రా మొత్తం మూడున్నర వేల మంది సిబ్బందిని ఏకంగా ఏడు వేలకు పెంచుకునేందుకు హైడ్రా ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు సమాచారం.
ఆఫీసర్ ర్యాంక్.. క్యాడర్/ శాఖ.. సిబ్బంది సంఖ్య
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ..ఐపీఎస్/ పోలీసు.. 01
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ...న్యాన్ క్యాడర్/ పోలీసు.. 03
డీఎస్‌పీ... పోలీసు.. 05
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్... పోలీసు.. 21
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. పోలీసు.. 33
రిజర్వ్డ్ఇన్‌స్పెక్టర్.. పోలీసు.. 5
రిజర్వ్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్.. పోలీసు ..12
పోలీసు కానిస్టేబుల్స్.. పోలీసు.. 101
హోం గార్డ్స్.. పోలీసు.. 72
అనలిటికల్ ఆఫీసర్స్.. పోలీసు.. 3
అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్స్.. పోలీసు.. 3