దుర్గం చెరువులో దూకబోయిన యువకుడు.. కాపాడిన హైడ్రా సిబ్బంది

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం కలకలం రేగింది.

దుర్గం చెరువులో దూకబోయిన యువకుడు.. కాపాడిన హైడ్రా సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం కలకలం రేగింది. ఓ యువకుడు దుర్గం చెరువు వద్దగల కేబుల్ బ్రిడ్జ్ మీది నుంచి చెరువులోకి దూకేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న హైడ్రా సిబ్బంది ఒకరు దీనిని గమనించి, యువకునికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. బ్రిడ్జ్ మీది నుంచి వెళుతున్న వాహనదారులు కాసేపు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. కొద్దిసేపటి దాకా ఆ యువకుడికి తీవ్రంగా నచ్చజెప్పి, ప్రాణాలు కాపాడారు. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు హైడ్రా సిబ్బందిని ప్రశంసించారు.

Next Story