- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AV Ranganath : సీఐపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ(Hayath Nagar CI)పై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ(Hayath Nagar CI)పై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వివాదాస్పద భూమిలో జరిగిన దాడి సంఘటనపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ సీఐ ఎస్.శివ శంకర్ పై మండిపడ్డారు. కోహెడలో సర్వే నంబర్ 951, 952లోని వివాదాస్పద భూమిలో జరిగిన దాడి ఘటనపై సమాచారం అందుకున్న కమిషనర్ నేడు ఆ భూమిని పరిశీలించారు. సంఘటనకు సంబంధించి తగిన చర్యలు తీసుకోకపోవడంపై.
నేడు రంగనాథ్ ఈ భూమిని పరిశీలించగా, స్థలం కొనుగోలుదారునికి ఫామ్‌హౌస్ యజమాని సమ్మిరెడ్డి బాల్ రెడ్డి మధ్య వివాదం ఉన్నట్లు తెలిసింది. బాల్ రెడ్డి మారణాయుధాలతో దాడి చేయగా.. తలకు 12 కుట్లు పడ్డాయని బాధితుడు కమిషనర్ ముందు కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. ఘటనపై సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో సీఐపై రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మారణాయుధాలతో దాడి జరిగితే కేసు పెట్టరా?” అని ప్రశ్నించారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.






