- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'హైదరాబాదీ చాయ్ అడ్డా' ప్రారంభించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
జనాలకు రుచికరమైన గరం చాయ్ తాగిపిస్తూ, యువతకు కార్పోరేట్ స్థాయి ఉపాధి చూపిస్తున్నాడు సినీ నటుడు, వ్యాపారవేత్త, సామాజిక సేవకులు అభినవ్ సర్ధార్.

దిశ, హిమాయత్ నగర్ : జనాలకు రుచికరమైన గరం చాయ్ తాగిపిస్తూ, యువతకు కార్పోరేట్ స్థాయి ఉపాధి చూపిస్తున్నాడు సినీ నటుడు, వ్యాపారవేత్త, సామాజిక సేవకులు అభినవ్ సర్ధార్. తెలుగు రాష్ట్రాల్లో టీ బిజినెస్‌కు ఫర్‌ఫెక్ట్ కార్పోరేట్ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన 'హైదరాబాదీ చాయ్ అడ్డా' సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తాజాగా తన నూతన ప్రీమియం ఫ్రాంచైజీని హైదరాబాద్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీపట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీపట్నాయక్ మాట్లాడుతూ.. ''ఈ తరం యువత ఉద్యోగాలు సైతం వదిలి టీ వ్యాపారంలో దూసుకుపోయేందుకు సరదా పడుతున్నారు. యువతకు కార్పోరేట్ స్థాయి వ్యాపారం చూపించేలా నటుడు అభినవ్ సర్ధార్ “చాయ్”కు కొత్త నిర్వచనాన్ని చెబుతూ 'హైదరాబాదీ చాయ్ అడ్డా' సంస్థను ప్రారంభించారు. ప్రీమియం ఫ్రాంచైజీలను దేశవ్యాప్తంగా అందిస్తూ యువతకు చక్కని ఉపాధి చూపిస్తున్నారు.
జీవితంలో ఎదగాలనుకునే వారికి చక్కని వ్యాపార అవకాశం ఆయన అన్నారు. హైదరాబాదీ చాయ్ అడ్డా' సంస్థ నిర్వహకులు అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ.. ''దేశంలోని యువతకు కార్పోరేట్ స్థాయిలో ఉపాధి అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 2016లో 'హైదరాబాదీ చాయ్ అడ్డా'(HCA)ను ప్రారంభించమన్నారు. ప్రతి చాయ్ కప్పులో సంప్రదాయాన్ని, ఆధునికతను మేళవించిన.. చాయ్‌ను కేవలం పానీయం కాకుండా ఒక భావోద్వేగ అనుభవంగా మార్చే లక్ష్యంతో ప్రారంభమైన హెచ్‌సీఏ, ఇప్పుడు ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తీసుకున్న వారు చాలా సంతోషంగా ఉన్నారు, ఈ కాన్సెప్టు చాలా మందికి నచ్చడంతో ఫ్రాంచైజీలను తీసుకుని స్టోర్స్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీ మోడళ్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, నిర్మాత లగడపాటి శ్రీధర్, జెమిని సురేష్, నటులు లోహిత్ కుమార్, షానీ, పలువురు మోడల్స్, టీవీ కళాకారులు పాల్గొన్నారు.






