- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 వేల లైవ్ సీసీ కెమెరాలతో... హైదరాబాద్ సీటీ భద్రత వీక్షణం...
మాక్ డ్రిల్ కార్యక్రమాలతో ఎవరు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ, డీజీ సీవీ ఆనంద్ తెలిపారు.

దిశ, సిటీక్రైం : మాక్ డ్రిల్ కార్యక్రమాలతో ఎవరు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ, డీజీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భద్రత పరంగా అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ డిఫెన్స్ తో పాటు ఇతర కీలక శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కార్యాలయాలు, ఇతర భవనాలు ఉండడంతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ నేపధ్యంలో భద్రత పరంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ ను దాదాపు 12 ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్తహిస్తున్నట్లు తెలిపారు. ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన పరిస్థితి లేదన్నారు. అంతా సురక్షితంగా ఉందన్నారు.
పాకిస్తాన్ లోని టెర్రరిస్టు స్థావరాల పై భారత్ సైన్యం చేసిన దాడుల సంఘటన తర్వాత హైదరాబాద్ నగరంలో పోలీసు నిఘాను పెంచామన్నారు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి కదిలికల పై నజర్ పెంచామన్నారు. ఇంటి గ్రేటడ్ పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి 12 వేల ప్రత్యక్ష సీసీ కెమెరాలతో మొత్తం నగరంలో నెలకున్న పరిస్థితిని లైవ్ లో వీక్షిస్తున్నామని సీపీ వివరించారు. దీనికి తోడు 6 లక్షల నేను సైతం కెమెరాలు కూడా భద్రతలో కీలకంగా మారాయన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బంగ్లాదేశ్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఎవరైనా అక్రమంగా ఉంటే వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అదే విథంగా ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.






