- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓవర్ లోడ్ ఆటోలలో విద్యార్ధులను పంపకండి..
పాఠశాలలు ప్రారంభమైన వేళ రోడ్ల పై విద్యార్ధుల భద్రత పై రవాణ శాఖ, జీహెచ్ఎంసీ, విద్య శాఖ , పాఠశాల యాజమాన్యాలు, స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్ లతో హైదరాబాద్ పోలీసులు గురువారం రవీంద్రభారతిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

దిశ, సిటీక్రైం : పాఠశాలలు ప్రారంభమైన వేళ రోడ్ల పై విద్యార్ధుల భద్రత పై రవాణ శాఖ, జీహెచ్ఎంసీ, విద్య శాఖ , పాఠశాల యాజమాన్యాలు, స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్ లతో హైదరాబాద్ పోలీసులు గురువారం రవీంద్రభారతిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూల్ పిల్లల రవాణ భద్రతకు సంబంధించిన అంశాల పై చర్చించారు. స్కూల్ పిల్లల రవాణకు సంబంధించిన విషయాలను ట్రాఫిక్ పోలీసుల మీద భారం వేయుండా తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు వారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. దీని కోసం ఆటోలలో అనుమతికి మించి విద్యార్ధులను తీసుకువెళ్తున్న వాటిలో పిల్లలను పంపొద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అదే విధంగా పాఠశాలల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా యాజమాన్యాలు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ ను నియంత్రించుకోవాలన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లు కూడా పిల్లలు బస్సులలో ఎక్కి, దిగే సమయాలతో పాటు రోడ్డు క్రాసింగ్ ల వద్ద అన్ని గమనించాలన్నారు. బస్సులలో కచ్చితంగా అటెండర్ లు, మహిళ అటెండర్ లు ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా బస్సు డ్రైవర్ లు తమ బస్సులు ఫిట్ నెస్ ను నిరంతరం తనిఖీ చేసుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు సూచించారు. మద్యం సేవించి స్కూల్ బస్సులను అసలు నడిపించొద్దని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ అబిడ్స్ , సికింద్రాబాద్ , జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో స్కూల్స్ అన్ని ఒకే చోట ఉండడంతో ఆ ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంటుందని కాబట్టీ యాజమాన్యాలు ప్రైమరీ, హై-స్కూల్స్ స్కూల్ టైమింగ్ లలో మార్పులు చేసి రద్దీ ని లేకుండా చూసుకోవాలన్నారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలను స్కూల్ కు తీసుకువస్తున్న తరుణంలో ట్రాఫిక్ రూల్స ను కచ్చితంగా పాటించాలన్నారు. నిర్లక్ష్యం చేయొద్దని పోలీసులు సూచించారు. ఇక మీదట రద్దీ ఉండే స్కూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు డ్రోన్ ల ద్వారా అక్కడి పరిస్థితి గమనిస్తామని పోలీసులు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించే వారి పై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన మాట్లాడుతు స్కూల్ విద్యార్ధులను ప్రమాదాల బారిన పడకుండా ఒక ప్రామాణికతో కూడిన ప్రక్రీయను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జిఓ 187, విద్య హక్కు చట్టాన్ని పాఠశాల యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతు స్కూల్ విద్యార్ధులు ప్రమాదాల బారిన పడకుండా అవసరమైన అన్ని చర్యలను సిటీ ట్రాఫిక్ పోలీసులు తీసుకొంటున్నారని వివరించారు. పోలీసులకు సహాయంగా తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్ లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
నగరంలో దాదాపు 90 లక్షల వాహనాలు రూడ్లపై తిరుతున్నాయన్నారు. 3 వేల మంది సిబ్బందితో ట్రాఫిక్ పోలీసు సేవలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. స్కూల్స్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. స్కూల్స్ వద్ద చుట్టు 200 మీటర్ ల విస్తీర్ణంలో మొత్తం బాధ్యతను పాఠశాలల యాజమాన్యాలు తీసుకోవాలన్నారు. మైనర్ లకు వాహనాలను ఇవ్వొద్దని సీపీ చెప్పారు. దాదాపు 746 మంది మైనర్ లు వాహనాలను నడిపించడం వల్ల ఆ వాహనాల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశామని చెప్పారు. ఈ మైనర్ లకు 25 ఏండ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ట్రాఫిక్ రూల్స ్పై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రోహిణి, అదనపు డైరెక్టర్ స్కూల్ ఎడ్యూకేషన్ లింగయ్య, ఆర్టీసీ ఈడీ మునిశేఖర్, హెచ్ సిఎస్ సి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్ ట్రాఫిక్ జోయెల్ డేవిస్, తదితర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






