జూబ్లీహిల్స్ రాబ‌రీ అండ్ మ‌ర్డ‌ర్ కేసులో పురోగ‌తి సాధించిన హైద‌రాబాద్ పోలీసులు

by Ratna Kumari |   (  Updated:2026-05-10 11:59:22  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ ఐపీఎస్ భార్య హత్య అండ్ రాబరీ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతిని సాధించారు.

జూబ్లీహిల్స్ రాబ‌రీ అండ్ మ‌ర్డ‌ర్ కేసులో పురోగ‌తి సాధించిన హైద‌రాబాద్ పోలీసులు
X

దిశ, సిటీక్రైం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ ఐపీఎస్ భార్య హత్య అండ్ రాబరీ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతిని సాధించారు. సంఘటనలో పాల్గొన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మే 8 అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధి ప్రశాసన్ నగర్ లో నివాసం ఉంటున్న మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన కల్పన మరో ముగ్గురితో కలిసి ఆయన భార్య తనూజ రంజన్ ను హత్య చేసి బంగారం, నగదుతో పారిపోయిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సారధ్యంలోని పోలీసు టీం లు ఘటన స్థలంలో దొరికిన ప్రాధమిక ఆధారాలతో దర్యాప్తు వేగాన్ని పెంచారు.

పోలీసుల సూపర్ ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ తో సంఘటనలో పాల్గొన్న ఇద్దరీని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. వీరు కూడా నేపాల్ కు చెందిన వారేనని సమాచారం. ఈ ఇద్దరీ సహాయంతోనే ఆ ఇంట్లో పని చేసిన కల్పన రాబరీకి పాల్పడిందని తెలుస్తోంది. సోత్తును చోరీ చేసే సమయంలో తనూజ రంజన్ నోట్ల బట్టలు కుక్కి, చేతులు కొట్టేయడంతో ఆమె ఊపీరి ఆడక చనిపోయి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా అంచనా వేశారు. దుండగులు సంఘటన తర్వాత ఆటోలో ప్రయాణీంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కు పారిపోయి అక్కడి నుంచి రైలు మార్గంలో మహారాష్ట్రకు పారిపోయారని కొన్ని క్లూస్ లభించడంతో పోలీసు టీంలు పరుగులు పెట్టాయి. అయితే దుండగులు పోలీసుల దృష్టి మళ్లించేందుకు వేరు వేరుగా విడిపోయినట్లు పసిగట్టిన పోలీసులు దర్యాప్తు కోణాన్ని మార్చి వారి వెంట పడ్డారు. చివరకు కల్పనకు సహాకరించిన ఇద్దరు పోలీసులకు చిక్కారని సమాచారం. కల్పన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చోరీ సోత్తు రికవరీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ నగర పర్యటన భద్రత, బందోబస్తులో బిజీబిజీగా నిమగ్నమై ఉన్నా పోలీసు బాసు అండ్ టీం నిద్రలు మాని ఈ నేరస్థులను పట్టుకునేందుకు 24/7 పని చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ రాబరీ అండ్ మర్డర్ కేసు పూర్తిగా చేధించి అధికారికంగా వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇద్దరు అదుపులో ఉన్నారనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.

Next Story