Hyderabad MLC Election : రేపే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

by Muthe.Rajitha |

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు(Hyderabad Local Bodies Quota MLC Election) బుధవారం జరగనున్న విషయం తెలిసిందే.

Hyderabad MLC Election : రేపే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు(Hyderabad Local Body MLC Election) బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఎన్నికల కమిషన్(EC) ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం(BJP vs MIM) మాత్రమే బరిలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. బీజేపీ నుంచి గౌతం రావు పోటీ చేస్తుండగా.. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ పోటీలో ఉన్నారు. కాగా ఇరు పార్టీలు పొటాపోటీగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక పలు చోట్ల హిందువులు అంతా బీజేపీకే ఓటు వేయాలని బ్యానర్లు కూడా వెలియడం గమనార్హం. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో నిన్నటి నుంచే అన్ని వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.

Next Story