ఈనెల 20 నుంచి హైటెక్స్ లో హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌ 2025

by Ratna Kumari |

దిశ, శేరిలింగంపల్లి : హైటెక్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి రెండు రోజుల పాటు 18వ హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌ (హెచ్‌కెఎఫ్‌ 2025) నిర్వహించనున్నారు.

ఈనెల 20 నుంచి హైటెక్స్ లో హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌ 2025
X

దిశ, శేరిలింగంపల్లి : హైటెక్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి రెండు రోజుల పాటు 18వ హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌ (హెచ్‌కెఎఫ్‌ 2025) నిర్వహించనున్నారు. హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ లో ఈ ఫెయిర్ జరగనుంది. ఇందు కోసం హైటెక్స్‌ పెరల్‌ కాన్ఫరెన్స్ హాల్‌ లో నిర్వహించిన కర్టెన్‌–రైజర్‌ ప్రెస్‌ మీట్ లో హైటెక్స్‌ బిజినెస్‌ హెడ్‌.డ్ టి.జి. శ్రీకాంత్‌ హెచ్‌కెఎఫ్‌ 2025 అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్, భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన పిల్లల ఎక్స్‌పోలలో ఒకటిగా ఎదిగిందని అన్నారు. వినోదం, విద్య, సృజనాత్మకత, ఫిట్‌నెస్, కుటుంబ వినోదం అన్నింటినీ సమతుల్యం చేసే వేదికగా ఇది నిలుస్తుందని తెలిపారు. ఈ రెండు రోజుల ఫెయిర్‌కు 25,000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉండగా 50కి పైగా ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటున్నారని వివరించారు. న్యూట్రిషన్, విద్య, లైఫ్‌స్టైల్, బొమ్మలు, పుస్తకాలు, హాబీలు విభిన్న విభాగాలకు చెందిన అనేక ఉత్పత్తులు, సేవలు ఈ ఫెయిర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా కిడ్స్‌ బిజినెస్‌ కార్నివల్‌ (రెండో ఎడిషన్‌) నిర్వహించనున్నారు. ఇందులో 60 మందికి పైగా చిన్నారి వ్యాపారవేత్తలు తమ ఆలోచనలు, ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హెచ్‌కెఎఫ్‌ 2025లో పిల్లల కోసం అనేక ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్‌ జోన్లు ఉండనున్నాయి. జిగిల్‌ మగ్‌ ఆధ్వర్యంలో జంగిల్‌ థీమ్‌తో కిడ్స్‌ రన్, ప్లే గ్రౌండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వహించే కన్ స్ట్రక్షన్‌ యాక్టివిటీస్‌ జోన్, గేమాలజీ జోన్‌ లో నాన్‌–డిజిటల్‌ గేమ్స్, లీప్‌ రోబోట్స్‌ ఆధ్వర్యంలో రోబోటిక్స్‌ వర్క్‌షాపులు, చిల్డ్రన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికేషన్‌ యాక్టివిటీ, క్రెగ్‌ స్టూడియో నిర్వహించే క్లైంబింగ్‌ వాల్‌ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Next Story