హైదరాబాద్ లో అక్రమ తుపాకుల దందా.. హెయిర్ సెలూన్ నిర్వాహకుడు స్కెచ్..

by Bhanu |

వివాహంతో తన జీవితంలోకి రాబోతున్న భార్య కుటుంబం ముందు పలికిన గొప్పలను నిలబెట్టుకునేందుకు ఓ హెయిర్ సెలూన్ నిర్వాహకుడు ఏకంగా హైదరాబాద్ లో అక్రమ ఆయుధాల దందా కు శ్రీకారం చుట్టాడు.

హైదరాబాద్ లో అక్రమ తుపాకుల దందా.. హెయిర్ సెలూన్ నిర్వాహకుడు స్కెచ్..
X

దిశ, సిటీ క్రైం : వివాహంతో తన జీవితంలోకి రాబోతున్న భార్య కుటుంబం ముందు పలికిన గొప్పలను నిలబెట్టుకునేందుకు ఓ హెయిర్ సెలూన్ నిర్వాహకుడు ఏకంగా హైదరాబాద్ లో అక్రమ ఆయుధాల దందా కు శ్రీకారం చుట్టాడు. ఈ సమాచారం అందుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసారు. అతని నుంచి 5 తుపాకులు, 15 బుల్లెట్ లు, 3 ఖాళీ కాట్రిడ్జి లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం లో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ జీషన్ 10 ఏండ్ల కిందట హైదరాబాద్ కు వచ్చి బాలాపూర్ రక్షపురం ప్రాంతం లో హెయిర్ సెలూన్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సెలూన్ లను ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరించాడు.

ఇలా బాలాపూర్ తో పాటు ఓల్డ్ సిటీ లో స్నేహం పెంచుకున్నాడు. దీంతో పాటు స్నేహం పెరిగి విలాసలకు అలవాటు పడి ఆర్ధికంగా కష్టాలు తెచ్చుకున్నాడు. ఇంత లో పెండ్లి ఫిక్స్ అయ్యింది కాబోయే భార్య కుటుంబం ముందు గొప్పలు చెప్పుకున్నాడు. వాటిని నిలబెట్టుకునేందుకు అక్రమ ఆయుధం దందా కు స్కెచ్ వేసాడు. దీని కోసం తన దగ్గర పని చేసే మొహమ్మద్ అమిర్ సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి యూపి రాంపూర్ లోని ఆర్సీ ఖాన్ నుంచి అతి తక్కువ ధరకు తుపాకులను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ లో ఒక తుపాకీని 2 లక్షలకు విక్రయించాలని ప్లాన్ చేసారు.

రెండు రోజుల ముందు ట్రైన్ లో 5 తుపాకులు, 15 బుల్లెట్ లు, 3 కాట్రిడ్జ్ లను తీసుకు వచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసారు. ఈ తుపాకులను ఎవరికీ అమ్మాలనుకున్నారు, ఈ తుపాకులను కోనేందుకు ఎవరు ప్రయత్నించారు ఎందుకు కొనాలనుకుంటున్నారు, అంశాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తదుపరి విచారణ ను బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. కోర్టు అనుమతి తీసుకుని ఈ ఇద్దరినీ కస్టడీ లోకి తీసుకుని వారిని మరోసారి పోలీసులు విచారించునున్నారు.

Next Story