ప్రపంచ వేదికగా కీర్తిని అందుకున్న తెలంగాణ పోలీస్..

by Bhanu |

హైదరాబాద్ పోలీస్ ప్రతిష్ట ప్రపంచ వేదిక పై మెరిసింది. దీంతో తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ కు ప్రపంచ గుర్తింపు లభించింది.

ప్రపంచ వేదికగా కీర్తిని అందుకున్న తెలంగాణ పోలీస్..
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పోలీస్ ప్రతిష్ట ప్రపంచ వేదిక పై మెరిసింది. దీంతో తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ కు ప్రపంచ గుర్తింపు లభించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో హైదరాబాద్ హెచ్ - న్యూ విభాగం మత్తు పదార్ధాలు, డ్రగ్స్ ను నియంత్రణ నివారణ లో చేస్తున్న కృషి కి ఈ అవార్డు దక్కింది. ప్రపంచం వ్యాప్తంగా 138 దేశాలకు చెందిన పోలీస్ విభాగాలు వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో పాల్గొన్నాయి. ఎఫ్ బీఐ, న్యూ యార్క్ పోలీస్ డిపార్ట్మెంట్, లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్, యూ కే మెట్రోపోలీటన్ పోలీస్, ఆస్ట్రేలియాన్ ఫెడరల్ పోలీస్, జర్మనీ పోలీస్ విభాగాలు ప్రతినిధులు ఈ సమ్మిట్ లో హాజరయ్యారు.


డ్రగ్స్, ఇతర మాదాకద్రవ్యలను అరికట్టడం లో ఈ డి, ఎన్ సీఆర్ బీ, డి ఆర్ ఐ, ఎక్స్ సైజ్, ఎఫ్ ఆర్ ఆర్ ఓ, డ్రగ్స్ కంట్రోల్ విభాగం తో సమన్వయం తో చేస్తున్న చర్యలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆన్ లైన్ వివరించారు. మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. అవగహన కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తు కనపడుతున్న ఫలితాలను ముందుపెట్టారు. వీటన్నింటిని పరిశీలించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ ప్రతినిధులు హైదరాబాద్ హెచ్ -న్యూ ను, సీపీ సీవీ ఆనంద్ ను ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నారకోటిక్స్ అవార్డు కు ఎంపిక చేసారు. ఈ అవార్డు ను మే 15 న దుబాయ్ లో సీపీ సీవీ ఆనంద్ అందుకోనున్నారు.


Next Story