- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ మిషన్‌లో హెచ్‌ఎన్ న్యూ టీం.. రివార్డులిచ్చిన సీపీ ఆనంద్
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ మిషన్‌లో హెచ్‌ఎన్ న్యూ టీం.. రివార్డులిచ్చిన సీపీ ఆనంద్
by Bhanu |
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న హెచ్‌ఎన్ న్యూ వింగ్ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు.

X
దిశ, సిటీక్రైం : హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న హెచ్‌ఎన్ న్యూ వింగ్ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యంగా సుదీర్ఘంగా కృషి చేస్తున్న ఈ విభాగం శుక్రవారం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకుంది. ఇన్‌స్పెక్టర్‌లు కే. శ్రీనివాస్, డానియెల్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో పని చేస్తున్న 80 మంది సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ రెండు టీమ్‌లు కలిసి డ్రగ్స్ వ్యాపారం కేసుల్లో ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేసి, మూడు ప్రధాన ముఠాలను జైలుకు పంపించారు. మత్తు పదార్థాల చలామణి నివారించేందుకు వారి కృషిని పోలీస్ శాఖ హర్షిస్తూ అభినందించింది.
Next Story






