మీ పార్సిల్ డ్రగ్స్ అంటూ.. ఓ డాక్టర్ కు 1.28 కోట్లు టోకరా..

by Bhanu |

డిజిటల్ అరెస్ట్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళకు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వ్యక్తిని మహారాష్ట్ర లో హైదరాబాద్ సీసీ ఎస్ సైబర్ క్రైం పోలీస్ లు గురువారం అరెస్ట్ చేసారు.

మీ పార్సిల్ డ్రగ్స్ అంటూ.. ఓ డాక్టర్ కు 1.28 కోట్లు టోకరా..
X

దిశ, సిటీక్రైం : డిజిటల్ అరెస్ట్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళకు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వ్యక్తిని మహారాష్ట్ర లో హైదరాబాద్ సీసీ ఎస్ సైబర్ క్రైం పోలీస్ లు గురువారం అరెస్ట్ చేసారు. హైదరాబాద్ లో ఓ డాక్టర్ ను డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టించి 1.28 కోట్లు కొట్టేసిన కేసు లో పోలీస్ లు ఈ అరెస్ట్ ను చేసారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ కు చెందిన 45 వయస్సు గల ఓ డాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేము ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము అని మాట్లాడారు. మీ పేరు మీద ఉన్న పార్సిల్ లో 14 పోలీస్ యూనిఫామ్ లు, 14 పోలీస్ ఐడి కార్డులు, కేటామైన్ ఇంజక్షన్ లు, బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఆందోళనకు గురిచేసారు. డాక్టర్ ఆ పార్సిల్ నాది కాదని తేల్చి చెప్పాడు.

అయ్యిన వారు వినుపించుకోకుండా పోలీస్ అధికారులు మాట్లాడుతారని కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. ఆ కాల్ మాట్లాడిన వారు తాము పోలీస్ అధికారులమని అరెస్ట్ చేస్తున్నామాన్ని భయపెట్టించారు. ఇంత లో వీడియో కాల్ చేసి పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి మాట్లాడి మీరు డ్రగ్స్ కేసులో ఇరికిపోయారు అరెస్ట్ చేస్తే జీవితాంతం బయటికి రారని కలవర పెట్టారు. మీ ఆర్ధిక లావాదేవీలు తనిఖీ చేస్తాం, మాకు డబ్బులు పంపించండి తిరిగి పంపిస్తామని చెప్పారు. ఈ తనిఖీ తర్వాత ఇక మీ అరెస్ట్ ఉండదని నమ్మించారు. వారిని నమ్మిన డాక్టర్ మొత్తం 1.28 కోట్లు బదిలి చేసాడు. చివరకు మోస పోయానన్ని డాక్టర్ సైబర్ క్రైం పోలీస్ లకు ఫిర్యాదు చేసాడు.. దర్యాప్తు చేసిన పోలీసులు నగదు బదిలీ అయ్యిన ఖాతాలను పరిశీలించి మహారాష్ట్రకు చెందిన రాంప్రసాద్ ను అరెస్ట్ చేసారు. ఈ ఖాతాలను విదేశాలల్లో ఉండే సైబర్ నేరగాళ్ళకు కమిషన్ ల మీద ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలా రాంప్రసాద్ ఇచ్చిన ఖాతాల తో దేశావ్యాప్తంగా మొత్తం 22 సైబర్ నేరాలకు సంబందించిన నగదు బదిలీ అయ్యిందని పోలీసులు గుర్తించారు. దీంతో రాంప్రసాద్ మీద 22 కేసు లు నమోదైనట్లి పోలీసులు తెలిపారు.


Next Story