- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నో సస్పెన్షన్స్.. ఓన్లీ డిస్మిస్: పోలీస్ సిబ్బందికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
పోలీసులు అవినీతికి పాల్పడినా, మాముళ్లు తీసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తే ఇక డిపార్ట్మెంట్ నుంచే తొలగిస్తామని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు...

దిశ, రాచకొండ: పోలీసులు అవినీతికి పాల్పడినా, మాముళ్లు తీసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తే ఇక డిపార్ట్మెంట్ నుంచే తొలగిస్తామని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బండ్లగూడ ప్రాంతంలో పాన్ షాప్ యజమాని దగ్గర డబ్బులు తీసుకోవడం, మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో స్పా సెంటర్‌ల దగ్గర డబ్బులు తీసుకున్న అంశాన్ని అడిగినప్పుడు సీపీ ఇక సస్పెన్షన్‌లు ఉండవని, ఇక డిపార్ట్మెంట్ రిమోవల్‌లు ఉంటాయని తెలిపారు. సస్పెన్షన్‌లతో సిబ్బందిలో మార్పు రావడం లేదన్నారు. అందుకే ఈ విధంగా కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు సీపీ చెప్పారు. మధురానగర్ పీఎస్‌లో చాలా వివాదాస్పద అంశాలు వెలుగు చూస్తున్నాయని, వాటిని పూర్తిగా విశ్లేషిస్తామని కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.






