- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ.. వారికి షోకాజ్ నోటీసులు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులను హెచ్చరించారు.

దిశ , హైదరాబాద్ బ్యూరో : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులను హెచ్చరించారు . ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్ ఆర్డీఓ , తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు . తహసీల్దార్ కార్యాలయం లోనికి వెళ్లి హాజరు రిజిస్టర్ ను పరిశీలించి అప్పటి వరకు కార్యాలయానికి రాని ఉద్యోగుల గురించి ప్రశ్నించారు . హాజరు రిజిస్టర్ లో ఉన్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరిని పిలిచి దృవీకరించుకున్నారు. విధులకు రాని సిబ్బందికి హాజరు రిజిస్టర్ లో ఆబ్సెంట్ వేయడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేశారు . ఉద్యోగులు సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యాలయ అన్ని విభాగాలను పరిశీలించారు. కార్యాలయ నిర్వహణ, రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు.
అనంతరం రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి సికింద్రాబాద్ మండలంలో ఎంతమంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులను ఫిజికల్ వెరిఫికేషన్, స్క్రూటినీ చేసి పంపించారని తహశీల్దార్ పాండునాయక్ ను ప్రశ్నించారు.దీంతో ఆయన 7,327 మంది నిరుద్యోగ యువత ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 2572 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కు వివరించారు. అన్ని దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఫిజికల్ గా వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు . ఈ సందర్భంగా ఆయన వెంట సికింద్రాబాద్ ఆర్డిఓ పి సాయిరాం ఉన్నారు.






