హైదరాబాద్ లో రూ1.26 కోట్ల గంజాయి, డ్రగ్స్‌ దహనం

by Bhanu |

రూ.1.26 కోట్ల గంజాయి డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. డిస్పోజల్‌ అధికారి హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ కే.ఏ.బీ శాస్త్రీ ఆదేశాల మేరకు ఎన్‌.శ్రీనివాసరావు, ఏ.మోహన్‌ బాబు అధ్యక్షతన హైదరాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలోని అమీర్‌పేట్‌, దూల్‌పేట్‌, గొల్కోండ, జూబ్లీ హిల్స్‌, కాచిగూడ, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 102 కేసుల్లో పట్టుబడ్డ డ్రగ్స్ గంజాయిని సోమవారం దహనం చేశారు.

హైదరాబాద్ లో రూ1.26 కోట్ల గంజాయి, డ్రగ్స్‌ దహనం
X

దిశ, కార్వాన్ : రూ.1.26 కోట్ల గంజాయి డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. డిస్పోజల్‌ అధికారి హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ కే.ఏ.బీ శాస్త్రీ ఆదేశాల మేరకు ఎన్‌.శ్రీనివాసరావు, ఏ.మోహన్‌ బాబు అధ్యక్షతన హైదరాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలోని అమీర్‌పేట్‌, దూల్‌పేట్‌, గొల్కోండ, జూబ్లీ హిల్స్‌, కాచిగూడ, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 102 కేసుల్లో పట్టుబడ్డ డ్రగ్స్ గంజాయిని సోమవారం దహనం చేశారు.


వీటి విలువ దాదాపు 1.26 కోట్ల రూపాయలు ఉంటుందని, వీటిలో 171.34 కేజీల గంజాయి, 21.03 కేజీల గంజాయి చాక్లెట్లు, 20కేజీల కుల్పీ 320.6 గ్రాముల హషీస్‌ అయిల్‌, 51గ్రాముల ఓజీ కుష్‌, 17.66 గ్రాముల ఎండిఎంఎ,12.గ్రాముల కోకైన్‌ లను దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు ,ఎస్సైలు ,ఎక్సైజ్ పోలిసులు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story