- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలిన ఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలిన ఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది. జైన్ టెంపుల్ సమీపంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలిపోవడంతో ఇంట్లో స్వల్ప ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
అయితే, ఘటన సమయంలో కుటుంబ సభ్యులు దూరంగా ఉండటంతో ప్రాణాపాయం తృటిలో తప్పినట్లైంది. వాషింగ్ మెషిన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ పేలుడు జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై వారు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






