- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అవమానం..
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అవమానం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.

దిశ, చైతన్యపురి : ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అవమానం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీసీ వర్గాలపై అగ్రకులాల నాయకులు విషపూరిత దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీసీ సంఘాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈశ్వరమ్మ యాదవ్ ను చింతలకుంటలోని ఆమె నివాసంలో రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు వేర్వేరుగా పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడుతూ.. 40 ఏండ్లు రాజకీయంలో ఉంటున్న నిస్వార్థ సేవకురాలు ప్రజల గొంతుకగా నిలిచిన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వివక్ష పూరితంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషనే ఆ పార్టీ అగ్రకుల నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీనియర్ నాయకురాలిని అవమానించిన శివచరణ్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి రక్షణ ఇవ్వకుండా అగ్రకుల నాయకుడికి ఇద్దరు గన్ మెన్లను ఇవ్వడం బీసీలను అవమానించడమేనని మండిపడ్డారు. సీనియర్ నాయకురాలిని అవమానించిన శివచరణ్ రెడ్డిపై ఆ పార్టీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి నోటీసులు ఇచ్చిన నాయకత్వం రెడ్డి నాయకుడికి ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈశ్వరమ్మ కు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. బహుజనుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని వచ్చే ఎన్నికల్లో బహుజనులు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం సునీల్ కుమార్, పోకల ఎలిజబెత్ బీసీ సంఘాల నాయకులున్నారు.






