- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ కల్లు సంఘటనపై విచారణకు ఆదేశించిన మానవ హక్కుల కమిషన్
మేడ్చల్ , మల్కాజ్ గిరి జిల్లాలో కల్తీ కల్లు సేవించి ఆరుగురు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్సీ) విచారణకు ఆదేశించింది.

X
దిశ,హైదరాబాద్ బ్యూరో : మేడ్చల్ , మల్కాజ్ గిరి జిల్లాలో కల్తీ కల్లు సేవించి ఆరుగురు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్సీ) విచారణకు ఆదేశించింది . జిల్లాలో కల్తీ కల్లు తాగి ఆరుగురు మరణించారని,మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారని, ఈ సంఘటనపై గురువారం అన్ని ప్రధాన పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయని, విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని రామారావు అనే వ్యక్తి హెచ్ఆర్సీకి ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీనిని విచారణకు స్వీకరించిన హక్కుల కమిషన్ ఆగస్టు 20వ తేదీలోగా సమగ్ర నివేదిక తమకు అందజేయాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
Next Story






