- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : హైదరాబాద్ లో మరో భారీ స్కాం.. రూ.150 కోట్ల మోసం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో భారీ స్కాం(Fraud) బయట పడింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో భారీ స్కాం(Fraud) బయట పడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల(Stock Market Investiments) పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు ఆక్రమార్కులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్(Jeedimetla PS) పరిధిలోని చింతల్ గణేష్ నగర్లో "ది పెంగ్విన్ సెక్యూరిటీస్" అనే సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అంటూ ఇన్వెస్టర్స్ నుంచి దాదాపు రూ.150 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టించుకున్నారు.
వీరిని నమ్మి రూ.లక్ష నుంచి కోటి వరకు బాండ్ల రూపంలో 1500 మంది వరకు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. గత కొంతకాలంగా సంస్థ ఆఫీసుకు తాళం వేసి ఉండగా.. ఫోన్లకు కూడా ఎవరూ స్పందించక పోవడంతో తాము నిండా మునిగినట్టు గ్రహించి లబో దిబో అన్నారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకొని న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.






