Breaking News : శ్రీతేజ ఆరోగ్యం ఎలా ఉందంటే?

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద "పుష్ప 2"(Pushpa 2) ప్రీమియర్ షో(Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో రేవతి(Revathi) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.

Breaking News : శ్రీతేజ ఆరోగ్యం ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద "పుష్ప 2"(Pushpa 2) ప్రీమియర్ షో(Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో రేవతి(Revathi) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రీతేజ కిమ్స్(KIMS) లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్(Health Bulletin) విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎక్కువసేపు మెలకువతోనే ఉంటున్నట్టు తెలిపారు. అయితే బాలుడు కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, ఎవ్వరు పలకరించినా ప్రతి స్పందన చూపించడం లేదని వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని, మరికొంత కాలం పట్టొచ్చు అని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా నటుడు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా ఆయనను చూడటానికి ఎగబడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కుటుంబంతో సహా సినిమా చూడటానికి వచ్చిన రేవతి కుటుంబం తొక్కిసలాటకు గురికాగా.. రేవతి సొమ్మసిల్లి పడిపోగా.. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఇక ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకు గురి కాగా, హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి విషమించి చాలరోజులు కోమాలోకి వెళ్ళగా.. ట్రీట్మెంట్ అనంతరం మెల్లగా కోలుకున్నాడు. ఇక ఈ తొక్కిసలాట గొడవ రాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా దూమరాన్ని రేపింది. నటుడు అల్లు అర్జున్ తో సహ చిత్ర యూనిట్ మీద కేసులు పెట్టి అరెస్టులు చేశారు. రాజకీయ నాయుకులు, పలువురు సినీ పెద్దలు రెండు వైపులా చేరి పలు విమర్శలు చేసుకున్నారు. కాగా శ్రీతేజ చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని సినిమా యూనిట్, నిర్మాతలు ముందుకు వచ్చారు. రేవతి కుటుంబాన్ని అన్ని రకాలుగా తాము ఆదుకుంటామని కూడా పేర్కొన్నారు.

Next Story