- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ వలలో గృహిణి
ఇన్ స్ట్రా గ్రామ్ లో పార్ట్ టైం ఉద్యోగం కోసం వెతికి సైబర్ మోసానికి గురై నగదు పోగొట్టుకున్న ఉదంతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

సైబర్ వలలో గృహిణి
ఇన్ స్టాగ్రామ్ లో పార్ట్ టైం ఉద్యోగం కోసం వెతికి సైబర్ మోసానికి గురై..
గుర్తు తెలియని వ్యక్తులకు విడతల వారీగా రూ.96వేలు చెల్లింపు
మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
దిశ, చైతన్యపురి: ఇన్ స్ట్రా గ్రామ్ లో పార్ట్ టైం ఉద్యోగం కోసం వెతికి సైబర్ మోసానికి గురై నగదు పోగొట్టుకున్న ఉదంతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్బీహెచ్ కాలనీలో నివాసం ఉండే గృహిణి శ్రీవర్షిణి పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఇన్స్ స్ట్రా గ్రామ్ లో శోధించింది. ఈ క్రమంలో ఈనెల 17 న 6003764837 వాట్సాప్ నంబర్ నుండి ఐదు రకాల టాస్క్స్ పూర్తిచేయాలనీ సూచించారు. టాస్క్స్ పూర్తిచేయగా రూ. 120 శ్రీ వర్షిణికి పంపించారు. వారు సూచించినట్లుగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.29 గంటల వరకు టెలిగ్రామ్ ద్వారా రూ. 96 వేలు పంపించింది. వారినుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసానికి గురైనట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.






