- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందానగర్ లో సందడి చేసిన సినీ నటి హిమజ
by Ratna Kumari |
చందానగర్ లో సినీ నటి హేమజ సందడి చేశారు. ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ హబీబ్స్ సరికొత్త ప్రీమియం సెలూన్ బ్రాంచ్ చందానగర్‌లో ప్రారంభించారు.

X
దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ లో సినీ నటి హేమజ సందడి చేశారు. ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ హబీబ్స్ సరికొత్త ప్రీమియం సెలూన్ బ్రాంచ్ చందానగర్‌లో ప్రారంభించారు. అమీన్‌పూర్ రోడ్, సురక్ష కాలనీ సంజీవని డయాగ్నోస్టిక్స్ సెంటర్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ నూతన సెలూన్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి హిమజ విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సెలూన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆకర్షణీయమైన రూపాన్ని అందించడంలో బ్యూటీ సెలూన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాల వారికి అందం, అలంకరణ రంగంలో సేవలు అందిస్తున్న హబీబ్స్ సెలూన్ బ్రాండ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. అధునాతన వసతులు, అనుభవజ్ఞులైన సిబ్బందితో ఈ సెలూన్ నగరవాసులకు అత్యుత్తమ సేవలు అందిస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ స్థానికులకు అందుబాటులోకి వచ్చిందని బ్యూటీ అండ్ హెయిర్ కేర్ రంగంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హబీబ్ మేనేజింగ్ డైరెక్టర్ అమన్ హబీబ్ పాల్గొన్నారు.
Next Story






