High Court : పాతబస్తీ మెట్రో పనులపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-17 11:30:36  IST  )

హైదరాబాద్ మెట్రో 2వ దశ(Hyderabad Metro 2nd Phase) నిర్మాణంపై హైకోర్ట్(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

High Court : పాతబస్తీ మెట్రో పనులపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో 2వ దశ(Hyderabad Metro 2nd Phase) నిర్మాణంపై హైకోర్ట్(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. నగరంలోని పాతబస్తీ(Old City) గుండా నిర్మిస్తున్న మెట్రో మార్గం పనులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. ఈ పిల్ పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. పలు వ్యాఖ్యలు చేసింది. నగరం అభివృద్ధిలో భాగంగా రవాణా మార్గాలు అవసరమే అయినప్పటికీ.. చారిత్రక కట్టడాలు(Heritage buildings) కూడా అంతే అవసరం అని తెలిపింది. మెట్రో నిర్మాణాల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని వ్యాఖ్యానించింది. పురావస్తుశాఖ గుర్తించిన కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టవద్దని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్తానం.. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

Next Story