హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డికి చెంపదెబ్బ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-27 15:03:51  IST  )

హైడ్రా కమిషనర్‌ను వెంటనే తొలగిచాలనే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఈ తీర్పు సీఎం రేవంత్‌కు చెంప దెబ్బలాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ...

హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డికి చెంపదెబ్బ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా కమిషనర్‌ను వెంటనే తొలగిచాలనే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఈ తీర్పు సీఎం రేవంత్‌కు చెంప దెబ్బలాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకే రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారని.. హైడ్రా చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్‌పై ఉండటం ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతున్నదని ఆరోపించారు. నాడు హిట్లర్ యూదులను నిర్మూలిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ హైడ్రాను ఏర్పాటు చేశామన్నారని అన్నారు. లోతుకుంట, బహదూర్‌గూడ, అమీన్‌పూర్‌లో హైడ్రా చేసిన అరాచకాల చిట్టా పెద్దదని తెలిపారు. సీఎం మున్సిపల్ శాఖకు సంబంధించినదే హైడ్రా అని.. రేవంత్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని రియల్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రాను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని హైకోర్టు అన్నదంటే రాష్ట్రంలో పాలన ఉన్నదా అని నిలదీశారు. తప్పు చేసిన అధికారులపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే హైడ్రాను రద్దు చేస్తామని తమ అధినేత కేసీఆర్ ప్రకటించారని.. అది జరిగి తీరుతుందని వెల్లడించారు.

Next Story