- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యూనియన్ ర్యాలీ.. మరోవైపు వర్షం
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ ర్యాలీ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Union Federation) ర్యాలీ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ అప్డేట్ ఇచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ర్యాలీ కారణంగా నగరంలోని యూసుఫ్‌గూడ మెయిన్ రోడ్, మహమూద్ ప్యారడైస్ ఫంక్షన్ హాల్, తారక్ ఫిల్మ్ హౌస్, సోమనాథ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కృష్ణా నగర్ రోడ్ వైపు వాహనాల రద్దీగా ఉంది. భారీగా ట్రాఫిక్ ఉండటంతో వాహనాల రాకపోకలు మందగించాయి.. అని ట్రాఫిక్ అప్డేట్ తెలిపింది. అలాగే వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముసారాంబాగ్ మూసీ వంతెన మూసివేయబడిన కారణంగా, ప్రస్తుతం చాదర్‌ఘాట్ రోటరీ, ఆర్యూబీ (RUB), నల్గొండ క్రాస్ రోడ్, యశోద ఆసుపత్రి నుంచి న్యూ మలక్‌పేట్ వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయని ట్రాఫిక్ పోలీస్ అప్డేట్ ఇచ్చింది. వర్షం కారణంగా భారీ వాహన రద్దీతో పాటు పీక్ అవర్స్ కావడంతో, ప్రస్తుతం పీటీఐ, మహావీర్ హాస్పిటల్, మసబ్టాంక్ ఫ్లైఓవర్, ఎన్ఎమ్డీసీ నుంచి మధుర స్వీట్స్ వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయని (Hyderabad Traffic Police) ట్రాఫిక్ అప్డేట్స్లో తెలిపారు. ట్రాఫిక్ అప్డేట్ కోసం క్లిక్ చేయండి..






