- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రయాణికుల ఇక్కట్లు
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్ ప్రాంతాలతో పాటు హైకోర్టు, అఫ్జల్‌గంజ్, నయాపూల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు తీవ్రంగా మందగించాయి. వీకెండ్ కావడం, సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ నిర్వహణ కారణంగా ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్ పోలీసుల సూచనలు..
పుత్లిబౌలి, జాంబాగ్, ఎంజే మార్కెట్, అజంతాగేట్, గాంధీభవన్, తాజ్ ఐలాండ్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు వెళ్లే మార్గాల్లో పీక్ అవర్స్‌లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. ఇదే విధంగా న్యూ మార్కెట్, యశోదా హాస్పిటల్, నల్గొండ ఎక్స్ రోడ్, ఆర్‌యూబీ, ఆజాంపురా, చాదర్‌ఘాట్ రోటరీ ప్రాంతాల్లోనూ వాహనాల కదలిక నెమ్మదిగా ఉంది. ప్రయాణికులు ముందస్తుగా ప్రయాణ ప్రణాళిక చేసుకుని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో కిటకిట..
ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా మారింది. సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో స్టేషన్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి, భద్రతా చర్యలు పెంచారు.






