- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లోని ఆ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం.. పోలీసుల కీలక అప్డేట్స్
హైదరాబాద్(Hyderabad) నగరంలో బుధవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం(Heavy Rain) కురిసింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో బుధవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జాం(Heavy Traffic Jam) నెలకొంది. ఉద్యోగుల ఆఫీసులు వదిలే సమయం కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్ , హైటెక్ సిటీ ప్రాంతాల్లో తీవ్ర వాహనాల రద్దీ నెలకొంది. ఐకియా ఫ్లైఓవర్-కేబుల్ బ్రిడ్జ్, ఐకియా-మైండ్ స్పెస్, హైటెక్ సిటీ-కేపీహెచ్బీతోపాటు బేగంపేట, రసూల్ పుర, ప్యారడైజ్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.ఆయా రూట్లలో వెళ్లేవాళ్లు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ ను నియంత్రించేందుకు గంటల తరబడి కష్టపడాల్సి వస్తోంది.






