న‌గ‌రంలో భారీగా బంగారం చోరీ

by Ratna Kumari |

వారిద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సు చాలా తేడా. మ‌రోవైపు ప్రియుడికి పెళ్లి కూడా అయింది. పిల్ల‌లున్నార‌ని తెలిసి కూడా త‌న‌ను ప్రేమించింది.

న‌గ‌రంలో భారీగా బంగారం చోరీ
X

దిశ, చైతన్యపురి : వారిద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సు చాలా తేడా. మ‌రోవైపు ప్రియుడికి పెళ్లి కూడా అయింది. పిల్ల‌లున్నార‌ని తెలిసి కూడా త‌న‌ను ప్రేమించింది. అత‌నికి ఆర్థిక ఇబ్బందులున్నాయ‌ని ఇంట్లో ఉన్న కిలోన్న‌ర బంగారం అత‌నికి ఇచ్చింది. చివ‌రికీ ఇంట్లో తెలియ‌డంతో పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు అయింది. చైత‌న్య‌పురి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ్రీన్ హిల్స్ కాల‌నీలో నివాసం ఉండే దీప‌క్ ప‌టేల్ న‌డిపించే టైల్స్ షాపులో సాగ‌ర్ అనే వ్యక్తి నాలుగు సంవ‌త్స‌రాలుగా మేనేజ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. ఇంట్లో మ‌నిషిగా క‌లిసి పోయాడు. ఇదే క్ర‌మంలో సాగ‌ర్ కి దీప‌క్ ప‌టేల్ కూతురి పై క‌న్ను ప‌డింది.

ఆమెతో స్నేహం పెంచుకొని చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య స‌మ‌స్య‌లు, విలాస జీవిత‌పు అల‌వాట్ల‌కు ప‌రిచ‌యం పెంచుకుని యువ‌తితో చెప్పి వాళ్ల ఇంట్లో ఉన్న కిలోన్న‌ర బంగారు తీసుకొని బ‌య‌ట విక్ర‌యించాడు. దీంతో వ‌చ్చిన న‌గ‌దుతో కొంత మేర‌కు అప్పులు తీర్చుకున్నాడు. మ‌రికొంత న‌గ‌దుతో న‌చ్చిన దుస్తులు కొనుగోలు చేశాడు. ఈ మ‌ధ్య కుటుంబ స‌భ్యులు త‌మ స్వ‌గ్రామం వెళ్లేందుకు నిర్ణ‌యించుకుని ఇంట్లో ఉన్న బంగారం చోరీకి గురైన‌ట్టు గ్ర‌హించారు. వెంట‌నే చైత‌న్య‌పురి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ ప్రారంభించ‌గా.. నిందితురాలు ఫిర్యాదు దారుడు కూతురు అనే విష‌యం తెలిసింది. లోతుగా విచారించ‌డంతో ప్రియుడు సాగ‌ర్ కి ఇచ్చిన‌ట్టు ఒప్పుకుంది. 20 తులాల బంగారం రిక‌వ‌రీ చేశారు. మ‌రోవైపు ఫిర్యాదు దారుడి కూతురు దొంగిలించింద‌ని తెలుసుకున్న త‌రువాత కేసు వాప‌స్ తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Next Story