హైదరాబాద్‌లో భారీ వర్షం.. తడిసిపోతున్న వినాయక విగ్రహాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-26 08:39:14  IST  )

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది....

హైదరాబాద్‌లో భారీ వర్షం.. తడిసిపోతున్న వినాయక విగ్రహాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. పటాన్‌చెరు, ఇస్నాపూర్, తెల్లాపూర్, లింగంపల్లి, మదీన‌గూడ, మియాపూర్, కూకట్‌పల్లిలో భారీగా వాన పడుతోంది. దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లపై నీరు పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు వినాయక చవితి కావడంతో నగరంలోని రోడ్ల వెంట గణేశ్ విగ్రహాలు, పూజ సామగ్రి అమ్ముతున్నారు. అయితే వర్షం పడుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినాయకుడి విగ్రహాలు, పండ్లు, పూలు, పత్రిలు తడిసిపోతున్నాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరికొన్ని ప్రాంతాల్లో తుపర్లు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరం అంతా చల్లగా మారింది.

లింగంపల్లి మార్కెట్ వద్ద తాజా పరిస్థితిని వీడియో క్లిక్ చేసి చూడండి..

Next Story