శేరిలింగంపల్లిలో భారీ వర్షం

by Elthuri vijay kumar |

నగరంలో పలుచోట్ల మరోసారి భారీ వర్షం కురుస్తుంది. బుధవారం సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైదర్ నగర్, వివేకానంద నగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

శేరిలింగంపల్లిలో భారీ వర్షం
X

శేరిలింగంపల్లిలో భారీ వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

ట్రాఫిక్ జాంతో వాహనదారుల ఇబ్బందులు

దిశ, శేరిలింగంపల్లి : నగరంలో పలుచోట్ల మరోసారి భారీ వర్షం కురుస్తుంది. బుధవారం సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైదర్ నగర్, వివేకానంద నగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో కార్యాలయాల నుండి వచ్చేవారు అనేక ఇబ్బందులు పడ్డారు. బస్టాప్ లు, మెట్రో స్టేషన్ల కింద నిల్చుండి పోయారు. పలుచోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండాపూర్, హఫీజ్ పేట్, లింగంపల్లి, చందానగర్ లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది.

Next Story