Big Alert:హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-05 15:18:21  IST  )

హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది.

Big Alert:హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణం నెలకొంటుంది. పగలంతా ఎండలు దంచికొడుతుంటే.. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా (సోమవారం) హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి చల్లబడింది.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మాధపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్, పెద్దమ్మగుడి, గచ్చిబౌలీతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పొంగి పొర్లుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిసెంట్‌గా తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Next Story