హైదరాబాద్ లో భారీ వర్షం.. అన్ని విభాగాల కంట్రోల్ రూమ్స్ నంబర్లు ఇవే

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి భారీ వర్షం(Massive Rains) కురుస్తోంది.

హైదరాబాద్ లో భారీ వర్షం.. అన్ని విభాగాల కంట్రోల్ రూమ్స్ నంబర్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి భారీ వర్షం(Massive Rains) కురుస్తోంది. నగరంలోని రోడ్లు ఎటు చూసినా చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు భారీ వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు. NDRF, HYDRAA, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ, SDRF తదితర శాఖల కంట్రోల్ రూమ్స్ నంబర్లను అధికారులు విడుదల చేసారు. అత్యవసర సమయాల్లో ఆయా నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

Next Story