గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-13 08:58:14  IST  )

భాగ్యనగరంలో వర్షం దంచికొడుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
X

దిశ,వెబ్‌డెస్క్: భాగ్యనగరంలో వర్షం దంచికొడుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. ఈ రోజు(శుక్రవారం) హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో నగరంలోని నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, కోటి, గోషామహాల్, చార్మినార్, మలక్‌పేట్, చాదర్ ఘాట్‌లలో కుండపోతగా వర్షం పడుతోంది.

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని GHMC అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నగరవాసులను నిన్న(గురువారం) రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. ఊహించని విధంగా సాయంత్రం ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన నగరంపై విరుచుకుపడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story