- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాలు... కిక్కిరిసిన మెట్రో రైళ్లు
by Muthe.Rajitha |
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం(Massive Rains) కురిసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం(Massive Rains) కురిసింది. నగరంలోని రోడ్లు ఎటు చూసినా చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు భారీ వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో వేలాది వాహనాలు రోడ్లపై నత్తలాగా కదులుతున్నాయి. అయితే రోడ్లపై ఈ ట్రాఫిక్ ను తప్పించుకోడానికి నగర వాసులు మెట్రో రైలు(Metro Trains) ప్రయాణాన్ని ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాధారణం కంటే భారీ రద్దీ ఏర్పడింది. అన్ని మార్గాల్లో మెట్రోలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. అధిక రద్దీ రూట్లలో అదనపు మెట్రో రైళ్లను నడుపుతోంది సంస్థ.
Next Story






