హ‌త్య చేసి కిచెన్ గోడ క‌ట్టేశాడు

by Ratna Kumari |

మద్యం మత్తులో వ్యక్తి గత దూషణలు చేయడంతో స్నేహితుడిని హత్య చేశాడు. మర్డర్ నుంచి తప్పించుకునేందుకు అద్దె ఇంట్లో శవాన్ని పూడ్చి కిచెన్ గోడ కట్టేశాడు. ఐదు నెలలో తర్వాత ఇంటి యజమాని ఫిర్యాదుతో మర్డర్ మిస్టరీ బయటపడింది.

హ‌త్య చేసి కిచెన్ గోడ క‌ట్టేశాడు
X

దిశ‌, సిటీ క్రైమ్ : మద్యం మత్తులో వ్యక్తి గత దూషణలు చేయడంతో స్నేహితుడిని హత్య చేశాడు. మర్డర్ నుంచి తప్పించుకునేందుకు అద్దె ఇంట్లో శవాన్ని పూడ్చి కిచెన్ గోడ కట్టేశాడు. ఐదు నెలలో తర్వాత ఇంటి యజమాని ఫిర్యాదుతో మర్డర్ మిస్టరీ బయటపడింది. హత్యకు పాల్పడ్డ నిందితుడిని నేరేడ్ మెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం...గవ్వల మల్లేష్ వ్రుత్తి రీత్యా ప్లంబర్ గా జీవనం సాగిస్తున్నాడు. అతను కుటుంబం నుంచి వేరుగా ఉంటూ నేరేడ్ మెట్ జేకే కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్లంబింగ్ పనుల కోసం లేబర్ అడ్డా నుంచి కూలీలను తీసుకువెళ్ళే క్రమంలో అతనికి కంచి వెంకట రాములు పరిచయమయ్యాడు. ఇద్దరు స్నేహితులైయ్యారు. గత ఏడాది డిసెంబరు 15న పని లేకపోవడంతో ఇద్దరు కలిసి ముందుగా వైన్స్ వద్ద మద్యం సేవించారు. ఆ తర్వాత మల్లేష్ ఇంటికి వచ్చి మద్యం సేవించారు.


ఈ సమయంలో వెంకట రాములు మద్యం మత్తులో మల్లేష్ ను వ్యక్తిగతంగా దూషించాడు, హేళన చేశాడు. వాగ్వివాదం పెరిగి గొడవైంది. మల్లేష్ కర్రతో వెంకటరాములును చితకబాదాడు. గాయాలకు అతను మరణించాడు. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు మల్లేష్ శవాన్ని ఇంట్లోనే పూడ్చి దానిపై కిచెన్ ప్లాట్ ఫాం కట్టేశాడు. ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఐదు నెలలుగా మల్లేష్ రాకపోవడంతో ఈ నెల 17న ఇంటి యజమాని తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళాడు, ఒక రకమైన దర్వాసన రావడంతో కిచెన్ గోడ ను కూల్చగా అస్తిపంజరం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరంచేశారు. జూబ్లీ బస్సు స్టేషన్ వద్ద శుక్రవారం మల్లేష్ ను అరెస్టు చేసి, శనివారం రిమాండ్ కు తరలించారు. ఈ మిస్టరీని చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story