- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సికింద్రాబాద్: బీజేపీ సీనియర్ నాయకులు మేకల సారంగపాణి కుటుంబాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి మాతృమూర్తి మేకల లక్ష్మి ఇటీవల మరణించడంతో సోమవారం గవర్నర్ బండారు దత్తాత్రేయ బౌద్దనగర్ డివిజన్ మధురా నగర్ కాలనీలోని వారి నివాసానికి చేరుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా మేకల లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, నాయకులు శంకర్ రావు, పెద్ది రవీందర్, ఆర్ కృష్ణమూర్తి, కనకట్ల హరి, ప్రభు గుప్తా, ప్రకాష్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, వీరన్న, వేణు యాదవ్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






