- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేయడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, సీతాఫల్ మండి : ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేయడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావు నగర్ కి చెందిన జి.జనిమ్మ(19) ఈనెల 17న ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్, రాంనగర్ కి చెందిన పి.జగదీశ్(22) ఈ ఘటనకు కారణం అని తేలింది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి మధ్య ఇటీవల విభేదాలు పెరిగాయి. యువతి ఇతరులతో మాట్లాడుతుందని అనుమానంతో జగదీష్ తరుచూ గొడవ పడేవాడు. మానసికంగా వేధిస్తూ.. అసభ్యకరంగా దూషించేవాడని పోలీసులు వెల్లడించారు. వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన రోజు ఉదయం యువతి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగిన నిందితుడు.. కొద్ది సేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి కొద్ది నిమిషాలకే ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ కీలక ఆధారంగా లభించడంతో నిందితుడిని ఈ నెల 20న అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.






