నేడు హనుమాన్ జయంతి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 06:01:44  IST  )

హైదరాబాద్‌లో హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో నేడు నగరం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

నేడు హనుమాన్ జయంతి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి (Hanuman Jayanthi)ని పురస్కరించుకుని ఇవాళ నగరంలో భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు (Hyderabad Traffic Police)లు కఠినమైన ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధానంగా రెండు వైపుల నుంచి శోభాయాత్రలు ప్రారంభంకానున్నాయి. మొదటి శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్యారడైజ్ జంక్షన్ వరకు, రెండో శోభాయాత్ర కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుండి కోఠి వరకు కొనసాగుతాయి. ఇవాళ ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఊరేగింపు ముందుకు కదిలే కొద్దీ ఆయా ప్రాంతాల్లో దశలవారీగా ట్రాఫిక్ మళ్లింపులు లేదా నిలిపివేతలు ఉంటాయి.

ఈ మేరకు శోభాయాత్ర వెళ్లే కోఠి, అబిడ్స్, నారాయణగూడ, RTC ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ (ఔటర్ రూట్స్), మెహదీపట్నం నుంచి ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు నగరవాసులు సహకరించాలని.. నగరవాసులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం తమ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.

7 నిమిషాల హోరాహోరీ వేలం.. రూ.167.2 కోట్లుకు అమ్ముడైన ‘యశోదా కృష్ణ’ చిత్రం

Next Story