- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bawarchi Biryani : బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక... ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు
హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానిలో సగం తాగిన సిగరెట్ పీక వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానిలో సగం తాగిన సిగరెట్ పీక వచ్చింది. కంగుతిన్న కస్టమర్లు యాజమనితో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో గల బావార్చి రెస్టారెంట్లో(Bawarchi Restuarent) కొందరు యువకులు బిర్యానీ ఆర్డర్ చేశారు. సగం బిర్యానీ తిన్న తర్వాత.. అందులో సగం తాగి పడేసిన సిగరెట్ పీక కనిపించింది. దీంతో షాక్‌కు గురైన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిగరెట్ పీకను.. చూపించి హోటల్ సిబ్బందిని నిలదీశాడు. బిర్యానీలో ఇదేంటని వారిని ప్రశ్నించగా.. హోటల్ సిబ్బంది శాంతిపజేసే ప్రయత్నం చేశారు. తాము ఫుడ్ సెఫ్టీ అధికారులతో పాటు మీడియాకు విషయం చెబుతామని సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై తమకు సైతం ఫిర్యాదు వచ్చిందని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.






