- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతుల సంఖ్య పెరగడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే: బీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్
చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 17 మంది మృతి చెందిన ఘటనపై బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యా సాగర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, శేరిలింగంపల్లి : చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 17 మంది మృతి చెందిన ఘటనపై బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యా సాగర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో గత కొద్దిరోజులుగా వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండలేక పోతున్నాయని, అనునిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, గుల్జార్ హౌస్ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సహాయక చర్యలు ప్రారంభిస్తే ఇంత ప్రాణనష్టం జరగకపోయేదని, మృతుల సంఖ్య పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. సహాయక చర్యలు చేపడుతున్న ఫైరింజన్లలో నీళ్లు లేవని, అంబులెన్స్ లలో ఆక్సీజన్ లేదని, వారు మాత్రం ఎంత వరకు పోరాడుతారని అన్నారు.
గుల్జార్ హౌస్ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ నేత కర్నాటి విద్యా సాగర్ డిమాండ్ చేశారు. వరుస అగ్నిప్రమాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితుల సహాయం అందేలా చూడాలని, లేదంటే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, గత ఏడాది సికింద్రాబాద్ లో జరిగిన ఘటన నుండి తేరుకోక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం పట్ల కర్నాటి విద్యా సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






