Holiday : విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు హాలిడే!

by Muthe.Rajitha |

విద్యార్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌(Hyderabad)లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించినట్టు సమాచారం.

Holiday : విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు హాలిడే!
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌(Hyderabad)లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించినట్టు సమాచారం. సికింద్రాబాద్(Secundrabad) ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahakali Bonalu) అమ్మవారి ఆలయంలో ఈరోజు, రేపు బోనాల పండగ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే నగరంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా ప్రతియేటా హైదరాబాద్ మొత్తానికి ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. ఈ లెక్కన జులై 21న ప్రభుత్వం సెలవు ప్రకటించనుండగా... రేపు మాత్రం సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని విద్యాసంస్థలు మాత్రమే సెలవు ప్రకటించుకున్నాయి.

Next Story