Golkonda Bonalu: ఘనంగా ప్రారంభమైన గోల్కోండ బోనాలు..

by Malleboina Mahesh |   (  Updated:2023-06-22 07:17:00  IST  )

గోల్కొండలో సందడి షురూ అయింది. ఉదయం జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు.

Golkonda Bonalu: ఘనంగా ప్రారంభమైన గోల్కోండ బోనాలు..
X

దిశ, మెహిదీపట్నం: గోల్కొండలో సందడి షురూ అయింది. ఉదయం జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సుమారు 500 కు పైగా బోనాలు ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. దీంతో గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పోతరాజుల విన్యాసాలు ఉర్రూతలూగించాయి. శివసత్తుల పూనకాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. భారీ ఎత్తున ప్రజలు, భక్తులు వస్తుండటంతో గోల్కొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నేరెళ్ల జగదీష్ యాదవ్, ప్రసంగం నేతలు విజయ్ కుమార్, అనిల్ కుమార్, సత్యనారాయణ, ప్రేమ్ కుమార్ రామ్ కుమార్, వ్యాస తదితరులు పాల్గొన్నారు.

Next Story