- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదాం పైకప్పు పనులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి
విత్తనాల గోదాం పైకప్పు మారుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వనస్థలిపురం పరిధిలోని కోహెడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, వనస్థలిపురం: విత్తనాల గోదాం పైకప్పు మారుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వనస్థలిపురం పరిధిలోని కోహెడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, కోహెడకు చెందిన మహేశ్వర చారి, విష్ణు చారి అనే ఇద్దరు వ్యక్తులు స్థానికంగా గల జీనియస్ విత్తనాల గోదాంపై పాత రెక్కులను తొలగించి, కొత్త రెక్కులు అమర్చే పనిని స్వీకరించారు. శుక్రవారం ఉదయం వారు పనులు ప్రారంభించగా, తమ స్నేహితుడు పొట్లచెరువు గ్రామానికి చెందిన మల్లేశ్ (55) కూడా వారికి సహాయం చేయడానికి వచ్చాడు.
మధ్యాహ్నం సమయంలో మల్లేశ్ గోదాం పైకప్పుపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి కిందపడిపోయాడు. ఆయన తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్ సాయంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వనస్థలిపురం పోలీసులు వెల్లడించారు.






